Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్ డేట్ ?

  • ముగింపు దశలో 'నా పేరు సూర్య'
  • ఆడియో వేదిక విషయంలో ఆలోచన 
  • మే 4వ తేదీన భారీస్థాయి రిలీజ్  
వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోంది. ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం.

అయితే ఈ ఫంక్షన్ ను ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. హైదరాబాద్ లో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్ అవుతుంది. వైజాగ్ లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన 'నా పేరు సూర్య' వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్ లో గాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఎక్కడ నిర్వహించనున్నారనేది త్వరలోనే తేలనుంది. మే 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.     
allu arjun
anu emmanuel

More Telugu News